సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని రామక్కపేట గ్రామానికి చెందిన నిరుపేద మేర లక్ష్మణ్ ఇటీవలే మృతి చెందాడు. బీజేపీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయంగా 6, 800 రూపాయలను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ శ్రేణులు డాక్టర్ కొండా విటోభ, అవదూత జగదీష్, కొండా వెంకటేష్, కమ్మరి నవీన్, బట్టు అనిల్ కుమార్, మంతెన దయాకర్, పలువురు ఉన్నారు.