శుక్రవారం నెంటూర్ గ్రామంలో గల శ్రీహర్ష టాలెంట్ స్కూల్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి, బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈనెల 28 నుండి వచ్చే నెల 10 వరకు సెలవులు ఉండటం వలన అక్టోబర్ 2 పురస్కరించుకొని గాంధీ జయంతి ఘనంగా నిర్వహించారు. 8న దసరా బతుకమ్మ పండుగను పురస్కరించుకొని చిన్న పిల్లలచే గాంధీ వేషం వేయించి ఊర్లో ర్యాలీ తీశారు.