భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అకాల మరణం పట్ల ఎల్కతుర్తి కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఏ పదవి చేపట్టినా కానీ ఆర్భాటం చేయని నిరాడంబరుడు, దేశం ఆర్థికంగా నిలబడడానికి అనేక సంస్కరణలు చేసిన మహా గొప్ప మేధావి మన్మోహన్ సింగ్ అని ఆయన సేవలు చిరస్మరణీయమని, దేశం గొప్ప రాజకీయ నేతను కోల్పోయిందని అన్నారు.