విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మినీ స్టేడియంలో సీఎం కప్ మండల స్థాయి క్రీడా పోటీలను మంగళవారం ప్రారంభించారు. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వాన్ని కలిగిస్తాయని, గ్రామీణ యువతలోని క్రీడా ప్రతిభను వెలికితీయడం కోసమే ప్రభుత్వం సీఎం కప్ పేరిట క్రీడా పోటీలు నిర్వహిస్తున్నదన్నారు.