సంగారెడ్డి జిల్లా జిన్నారం కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలకు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు విద్యార్థి జీవితంలో కళాశాల చదువు అత్యంత కీలకమని, భవిష్యత్తును నిర్దేశించే రెండు సంవత్సరాలను శ్రద్ధతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అభిలాషించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్ తదితరులు ఉన్నారు.