జిల్లాలోని 27 మండలాలకు మండల విద్యాధికారులను నియమించినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయా మండలాల్లోని సీనియర్ ప్రధానోపాధ్యాయులను ఎంఈవోలుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయని చెప్పారు. ఎంఈవోలుగా నియామకమైన వారు వెంటనే ఆయ మండలాల్లో విధుల్లో చేరాలని సూచించారు.