సింగపూర్ పర్యటనను విజయవంతంగా ముగించుకున్న సీఎం బృందం ఆదివారం రాత్రి దావోస్ కు బయల్తేరనుంది. సీఎం సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు సోమవారం దావోస్‌కు చేరుకుంటారు. దావోస్‌లో నాలుగు రోజుల పాటు జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో పాల్గొంటారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం వేదికగా తెలంగాణకు ఉన్న సానుకూలతలను చాటి చెప్పి పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురానున్నారు.