ప్రముఖ టాలీవుడ్ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. నిద్ర మాత్రలు మింగి రెండ్రోజులుగా బెడ్ రూమ్‌కే పరిమితం కావడంతో కల్పన భర్తపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రికి వచ్చిన ఆమె భర్తను.. అక్కడి నుంచి నేరుగా ఇంటికి తీసుకొచ్చి మరోసారి తనిఖీలు చేస్తున్నారు. ఈ రెండు రోజులు తాను ఇంట్లో లేనని.. బయటకు వెళ్లానని కల్పన భర్త చెబుతుండటం గమనార్హం.