టీమిండియాతో జరిగిన మూడో వన్డేలో శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 248 పరుగులు చేసింది. అయితే, 39వ ఓవర్లో లంక వికెట్ కీపర్ మెండీస్‌కు, భారత బౌలర్ సిరాజ్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. మూడో బంతి తర్వాత ఇద్దరూ ఏంటి.. ఏంటి అంటూ మాటల యుద్ధానికి దిగారు. అయితే, కొద్దిసేపటికే అది సద్దుమణిగింది. ఇక ఈ మ్యాచ్లో మెండీస్ 59 పరుగులు చేయగా, సిరాజ్ 9 ఓవర్లలో 78 రన్స్ సమర్పించుకున్నారు.