జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు గ్రామంలో యువతి తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొనే దుర్భర పరిస్థితి నెలకొంది. కరీంనగర్ నుండి వస్తూ పూడూరు సెంటర్ లో బస్సు దిగిన యువతికి బాత్రూం వెళ్ళడానికి సౌకర్యం లేక తను వేసుకున్న దుస్తులు రక్తమయమైన దయనీయ పరిస్థితి ఎదుర్కొనవలసిన దుస్థితి ఏర్పడింది. గతంలో సర్పంచ్ గా కొనసాగిన వ్యక్తి స్త్రీ అయినప్పటికీ బాత్రూం నిర్మాణం చేపట్టాలని సూచించిన పట్టించుకోలేదని గ్రామస్తులు తెలిపారు.