చొప్పదండి: విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

60చూసినవారు
చొప్పదండి: విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం డైట్ చార్జీలను పెంచడంతో గంగాధర బీసీ బాలుర గురుకుల పాఠశాలలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాల్గొన్నారు. పాఠశాలలో విద్యార్థులకు వడ్డిస్తున్న భోజనాన్ని పరిశీలించారు, విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. పాఠశాలలో ఏ సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకురావాలని విద్యార్థులకు ఎమ్మెల్యే సూచించారు.

సంబంధిత పోస్ట్