దోంతాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా వీడ్కోలు వార్షికోత్సవ సమావేశం

1097చూసినవారు
దోంతాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా వీడ్కోలు వార్షికోత్సవ సమావేశం
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దోంతాపూర్ గ్రామంలో గల స్థానిక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణ నందు శుక్రవారం సాయంత్రం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు విద్యను అభ్యసించి ప్రస్తుతం ఐదవ తరగతి పూర్తి చేసుకోని ఆరవ తరగతి నిమిత్తం ఉన్నత పాఠశాలకు వెళ్తున్న శుభ సందర్భంగా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల యందు విద్యను అభ్యసించిన విద్యార్థిని విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసి తదుపరి పాఠశాల ఆవరణలో వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇట్టి వీడ్కోలు సమావేశ వార్షికోత్సవ వేడుక కార్యక్రమంలో భాగంగా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ప్రత్యేక వేష ధారణ లతో చేసిన నృత్య ప్రదర్శన, నాటక ప్రదర్శన లతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అలరించాయి.

ఈ కార్యక్రమంలో వారితో పాటు, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు భట్టూరి రాజేషం, పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది గజేల్లి సునీత, బండారి సతీష్, చుంచుకాల సింధూజ లతో పాటు, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు, యువత తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్