జగిత్యాల జిల్లాలోని ధర్మపురి పట్టణ కేంద్రంలో గల స్థానిక శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం వేళలో ఏప్రిల్, మే నెలలకు సంబందించి నిరుపేద కుటుంబాలకు ధర్మపురి పట్టణ కేంద్రానికీ చెందిన నరెడ్ల కమల, నర్ముల రాజమ్మ, ఇనాగుర్తి కిష్టయ్య లతో పాటు, బుగ్గారం మండలం లోని వెలుగోండ గ్రామానికి చెందిన నసుకూరి లావణ్య రోజులకు సరిపడా సుమారు రూ.2,500 విలువైన నిత్యావసర సరుకులను సంస్థ సభ్యుల చేతుల మీదుగా ఘనంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు, సంస్థ సభ్యులు అయినా మచ్చ రాజు, రంగు లక్ష్మీ నరహరి, రంగ హరినాథ్, పప్పుల శ్రీనివాస్, జైషేట్టి రాకేష్, నాలుమాస్ రాజేందర్, కోండ రవీందర్, పాలేపు శివ కుమార్, మధు నరేష్, షేగంటి శివ కుమార్, చాడ శ్రీనివాస్, ఎర్రోజుల సత్యం, స్తంభం కాడి జగదీష్, తదితరులు పాల్గొన్నారు.