ఘనంగా అంబలి పంపిణీ కార్యక్రమం

691చూసినవారు
ఘనంగా అంబలి పంపిణీ కార్యక్రమం
జగిత్యాల జిల్లాలోని ధర్మపురి పట్టణ కేంద్రంలో గల స్థానిక మునిసిపల్ కార్యాలయ పరిధిలో గల స్థానిక పదకోండవ వార్డుకు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త అయినా మద్ది కిషన్ ఆధ్వర్యంలో స్థానిక నంది కూడలి వద్ద వారి స్వగృహ ఆవరణ యందు సోమవారం ఉదయం వేళలో వేసవి కాలం పురస్కరించుకోని అంబలి పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ. ఈ అంబలి సేవించడం ద్వారా వేసవి కాలంలో వేడి నుండి ఉపశమనం పోంది శరీరాన్ని చల్లగా ఉంచడమే కాకుండా మనకు కావలసిన శక్తి లభ్యం అవుతుంది అని తెలుపుతూ ఈ అంబలి పంపిణీ ప్రతి రోజు ఉదయం వేళ నుండి మధ్యాహ్నం వేళ వరకు నిర్వహిస్తున్నట్టు ఆయన మీడియాకు తెలిపారు.

ధర్మపురి మునిసిపల్ కో-అప్షన్ సభ్యుడు అప్పాల వసంత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ. పదకోండవ వార్డు పరిధిలో మద్ది కిషన్ కుటుంబ సభ్యులు అంబలి పంపిణీ కేంద్రం ప్రారంభించడంతో ధర్మపురి పట్టణ ప్రజలకు ధర్మపురి పుణ్య క్షేత్రం నకు వచ్చే భక్తులకు ఈ అంబలి పంపిణీ కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుంది ఆయన మీడియాకు తెలిపారు. తధానంతరం ధర్మపురి మునిసిపల్ కో-అప్షన్ సభ్యుడు అప్పాల వసంత్ కుమార్ మద్ది కిషన్ వారి కుటుంబ సభ్యులను అభినందిస్తూ వారికీ శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఇట్టి కార్యక్రమంలో వారితో పాటు, మద్ది కిషన్ కుటుంబ సభ్యులతో పాటు, పప్పుల స్వాతి - శ్రీనివాస్, అప్పాల వసంత్ కుమార్ లతో పాటు, ధర్మపురి పట్టణ వర్తక వ్యాపారులు, పట్టణ ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్