జగిత్యాల జిల్లాలోని ధర్మపురి మండలలోని నేరెళ్ల గ్రామ సమీపంలో గల స్థానిక అభయ ఆరణ్యంలో వెలసిన పురాతన శ్రీ సాంబాశివా దేవాలయ ఆవరణ యందు ఆదివారం ఉదయం వేళ నుండి సాయంత్రం వేళ వరకు ఆర్యవైశ్య కపుల్స్ కిట్టి పార్టీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయం వేళలో ఆలయ అర్చకులు, వేద పండితులు, ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో. ఆర్యవైశ్య కపుల్స్ కిట్టి పార్టీ సభ్యులు పురాతన సాంబాశివా ఆలయంలో కిట్టి పార్టీలో పాల్గోనే దంపతులు స్వామి వారి ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమ అనంతరం వారికీ ఆలయ అర్చకులు, వేద పండితులు, ఆలయ కమిటీ సభ్యులు వారికీ స్వామి వారి తీర్థ ప్రసాదాలను ఘనంగా అందజేశారు. తదుపరి ఆలయ ఆవరణలో ఘనంగా వన భోజన కార్యక్రమాలను నిర్వహించి, వయస్సుతో పాటు, చిన్న పెద్ద అనే తేడా లేకుండా, తేగా ఆటలు ఆడి పాటలు పాడి పోద్దు అంతా చాలా సంతోషంగా గడిపారు. కార్యక్రమ తధానంతరం సీనియర్ ప్రభుత్వ ఉపాధ్యాయ దంపతులు అవోపా మహిళా జగిత్యాల జిల్లా అధ్యక్షురాలు, స్టేట్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు రంగ స్వప్న - శ్రీనివాస్ దంపతుల ఇరవైవ వివాహ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకోని ఆర్యవైశ్య కపుల్స్ కిట్టి పార్టీ వారి ఆధ్వర్యంలో వారికీ ఘనంగా వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపి వారి చేత కేక్ కట్ చేయించి, మిఠాయి లను పంచి, వివాహ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో వారితో పాటు, రంగ శ్రీ చరణ్, శ్రీ చందన్ లతో పాటు, ఆలయ అర్చకులు, వేద పండితులు, ఆలయ కమిటీ సభ్యులు, ఆయా గ్రామాల ప్రజలు, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆర్యవైశ్య కపుల్స్ కిట్టి పార్టీ సభ్యులు, స్థానిక యువత, తదితరులు పాల్గొన్నారు.