ఘనంగా ఉచిత మెగా వైద్య శిబిరం

358చూసినవారు
ఘనంగా ఉచిత మెగా వైద్య శిబిరం
జగిత్యాల జిల్లాలోని ధర్మపురి పట్టణ కేంద్రంలో గల స్థానిక కమలాపుర్ రోడ్డు యందు గల ఇందిరమ్మ కాలని నందు ధర్మపురి మండల, పట్టణ వెల్డింగ్ అసోసియేషన్ వ్యవస్థపాక గౌరవ అధ్యక్షుడు మహ్మద్ బాబా ఆధ్వర్యంలో కరీంనగర్ పట్టణ కేంద్రంలో గల స్థానిక మెడి కవర్ ఆసుపత్రి వారి సహాయ సహకారంతో మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. ఇట్టి ఉచిత మెగా వైద్య శిబిరానికి ఇందిరమ్మ కాలని వాసులతో పాటు, ధర్మపురి పట్టణ ప్రజలు సుమారు రెండు వందల మందికి పైగా హాజరు అవ్వగా ఆసుపత్రి సిబ్బంది వారికి బీపీ, షుగర్, ఈసీజీ, పల్స్, హైట్, వెయిట్, టెంపరేచర్, రక్త పరీక్షలు నిర్వహించి, తదుపరి ఉచితంగా వారికి సుమారు లక్ష రూపాయలకు పైగా విలువైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. డాక్టర్ తమ్మినేని హర్షిత్ కుమార్ చౌదరి ప్రజలకు ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్త లతో పాటు, పలు సలహాలు సూచనలు ఇచ్చారు. తదనంతరం ఉచిత వైద్య సేవలు అందించిన మెడి కవర్ ఆసుపత్రి వైద్య సిబ్బందిని స్థానికులు, ఇందిరమ్మ కాలని వాసులు, ధర్మపురి పట్టణ ప్రజలు ఘనంగా అభినందించారు. ఇట్టి కార్యక్రమంలో వారితో పాటు మెడి కవర్ ఆసుపత్రి క్యాంపు కో-ఆర్డినేటర్ తిప్పని కుమార్, పీఆర్ఓ భోనగిరి మహేష్ కుమార్, ల్యాబ్ టెక్నీషియన్స్ నిట్టు అనిల్ కుమార్, తాళ్లపల్లి సాయి సౌమ్య లతో పాటు, ధర్మపురి పట్టణ ప్రముఖ వైద్యులు డాక్టర్ సిరికోండ అశోక్ చారి, డాక్టర్ రవీందర్, సీనియర్ సామజిక సేవా కార్యకర్తలు అయిన వేముల రాజేష్, జైషెట్టి రాకేష్, సయ్యద్ అలీమ్, మహ్మద్ ఇర్ఫాన్ అలీ, మహ్మద్ ఇమ్రాన్ అలీ, మహ్మద్ ఇజన్ అలీ, మహ్మద్ రషీద్ లతో పాటు, స్థానికులు, ఇందిరమ్మ కాలని వాసులు, ధర్మపురి పట్టణ ప్రజలు, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు, యువత, వృద్ధులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్