జగిత్యాల జిల్లాలోని ధర్మపురి పట్టణ కేంద్రంలో గల స్థానిక వివేకానంద విగ్రహ సమీపంలో గల ప్రముఖ వ్యాపార వేత్త అయినా విజయ లక్ష్మీ హోల్ సేల్ కిరాణం అధినేత అయినా కరండ్ల మల్లేషం వారి కుమారులు అయినా కరండ్ల మహేష్, శేఖర్, గణేష్, వ్యాపార రీత్యా అయ్యప్ప ఆలయ సమీపంలో ఇటీవల కాలంలో నూతనంగా భవనాన్ని కోనుగోలు చేసి నూతన భవన ఆవరణ యందు షెడ్ నిర్మాణ పనులు చేపట్టగా అక్కడ బీరూపూర్ మండలం లోని తుంగూర్ గ్రామానికి చెందిన వెల్డింగ్ పనులు నిర్వహిస్తున్న వెల్డర్ దేషారాజుల శ్రీనివాస్ పైన నుండి ప్రమాదవషత్తు కింద జారీ పడడంతో. అక్కడ ఉన్న వారు వెంటనే స్పందించి జగిత్యాల పట్టణ కేంద్రంలో గల స్థానిక గీతా ఆర్థోపెడిక్ నర్సింగ్ హోమ్ యందు అడ్మిట్ చేయగా. శ్రీనివాస్ ను పరీక్షించిన ఆసుపత్రి వైద్యుడు నరహరి అతని చేయి విరిగి, నడుముకు తీవ్ర గాయాలు అయ్యాయి అని తెలిపి అతడికి సకాలంలో చికిత్స అందించి ఇటీవల కాలంలో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు. ఆదివారం రోజు ధర్మపురి మండల, పట్టణ వెల్డింగ్ అసోసియేషన్ సభ్యులు ధర్మపురి పట్టణ కేంద్రంలో ఘనంగా సమావేశం నిర్వహించి సోమవారం రోజు ఉదయం వేళలో దేషారాజుల శ్రీనివాస్ కు ధర్మపురి మండల, పట్టణ వెల్డింగ్ అసోసియేషన్ వ్యవస్థాపక గౌరవ అధ్యక్షుడు మహ్మద్ బాబా చేతుల మీదుగా రూ.12200 అందజేశారు. కార్యక్రమ తధానంతరం ధర్మపురి మండల, పట్టణ వెల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ బాబా ఆధ్వర్యంలో. శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు నగదు రూపేణా ఆర్థిక సహాయంతో పాటు, వారి కుటుంబ సభ్యులకు నేల రోజులకు సరిపడా ఇరవై ఐదు కీలోల బియ్యంతో పాటు నిత్యావసర వస్తువులతో పాటు వారి కుటుంబ సభ్యులకు ధర్మపురి మండల, పట్టణ వెల్డింగ్ అసోసియేషన్ సభ్యులు అండగా ఉంటామని వారికీ ఘనంగా హామీని ఇచ్చారు. ఇట్టి కార్యక్రమంలో వారితో పాటు ధర్మపురి మండల, పట్టణ వెల్డింగ్ అసోసియేషన్ సభ్యులు అయినా దామెర కోండ శ్రీనివాస్, విలాసాగర్ లక్ష్మీ రాజాం, బత్తిని పోషం, వేమునూరి ప్రవీణ్ లతో పాటు, ధర్మపురి మండల, పట్టణ వెల్డింగ్ అసోసియేషన్ సభ్యులు తదితరులు హాజరు అయి కార్యక్రమం విజయవంతం చేయడంతో ధర్మపురి మండల, పట్టణ వెల్డింగ్ అసోసియేషన్ సభ్యులకు ధర్మపురి మండల, పట్టణ వెల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ బాబా హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతూ. వెల్డింగ్ పనులు నిర్వహిస్తూ ప్రమాదవషత్తు ఏది అయినా జరిగితే వెల్డింగ్ చేస్తున్న వారికీ వారి కుటుంబ సభ్యులకు ధర్మపురి మండల, పట్టణ వెల్డింగ్ అసోసియేషన్ సభ్యులు అండగా ఉంటామని ఆయన వారికీ ఘనంగా హామీని ఇచ్చారు. అడగకుండానే ఆర్థిక సహాయం అందించిన ధర్మపురి మండల, పట్టణ వెల్డింగ్ అసోసియేషన్ సభ్యులకు దేషారాజుల శ్రీనివాస్ హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు.