ధర్మపురి బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా సత్యనారాయణ రెడ్డి

646చూసినవారు
ధర్మపురి బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా సత్యనారాయణ రెడ్డి
జగిత్యాల జిల్లాలోని ధర్మపురి పట్టణ కేంద్రంలో గల స్థానిక జూనియర్ సివిల్ కోర్ట్ ఆవరణ యందు బుధవారం సాయంత్రం వేళలో ధర్మపురి బార్ అసోసియేషన్ ఎన్నికల అధికారిగా గూడ జితేందర్ రెడ్డి వ్యవహరించగా, ధర్మపురి బార్ అసోసియేషన్ సభ్యులు నూతన అధ్యక్షుడిగా గడ్డం సత్యనారాయణ రెడ్డిని, ఉపాధ్యక్షుడిగా అలుక వినోద్ కుమార్, జనరల్ సెక్రటరీగా రౌతు రాజేష్, జాయింట్ సెక్రటరీగా బందెల రమేష్, లైబ్రరీ సెక్రటరీగా రామడుగు రాజేష్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీగా మామిడాల శ్రీకాంత్ కుమార్ లను, బార్ అసోసియేషన్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తధనంతరం గూడ జితేందర్ రెడ్డి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ. నూతనంగా ఎన్నిక అయినా కమిటీ సభ్యులు త్వరలోనే పదవి బాధ్యతలు స్వీకరిస్తారు అని వారు తెలిపారు. నూతనంగా ఎన్నిక అయినా బార్ అసోసియేషన్ కమిటీ సభ్యులను, ధర్మపురి బార్ అసోసియేషన్ సభ్యులు, తదితరులు ఘనంగా అభినందించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్