పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం

61చూసినవారు
పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం
జగిత్యాల పట్టణంలోని వివేకానంద హై స్కూల్ కు చెందిన 1992-93 పదవ తరగతి పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం స్థానిక వాసవి గార్డెన్స్ లో ఆదివారం ఉల్లాసంగా సాగింది. 31 సంవత్సరాల తర్వాత మిత్రులు ఒకే చోట చేరి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఆత్మీయంగా పలకరించుకున్నారు. వివిధ కారణాలతో మృతి చెందిన తోటి మిత్రుల ఆత్మశాంతికి 2 నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులర్పించారు. గురువులను శాలువలు, పూల బొకేలతో సన్మానించారు.

సంబంధిత పోస్ట్