జగిత్యాల పట్టణంలోని తహసిల్ చౌరస్తా వద్ద దేశంలో మతకల్లోలాలు విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా విద్వేషపూరిత వాఖ్యలు చేసిన కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను బిజెపి నాయకులు గురువారం దహనం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, జిల్లా అధ్యక్షులు పైడిపల్లి సత్యనారాయణ రావు, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. బోగ శ్రావణి, తదితరులు పాల్గొన్నారు.