జగిత్యాల జిల్లాలోని ధర్మపురి పట్టణ కేంద్రంలో గల స్థానిక మహాత్మా గాంధీ విగ్రహం వద్ద సిపిఐ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం వేళలో ప్రజా చైతన్య యాత్ర సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ పార్టీ జాతీయ నేత మాజీ శాసన సభ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి హాజరు అయి ఆయన సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల పైన ఆయన సుమారు అరగంటకు పైగా ప్రసంగించారు. తదుపరి సమావేశం వద్ద ధర్మపురి పట్టణ కేంద్రానికి పక్కనే ఉన్న గుండయ్య పల్లెకు చెందిన బుక రాములు ప్లాకార్డ్ పట్టుకోని ఉండగా చాడ వెంకట్ రెడ్డి ఆయన వద్దకు వెళ్లి బుక రాములు పడుతున్న సమస్యను అడిగి తెలుసుకోని బుక రాములు పడుతున్న సమస్య పైన జగిత్యాల జిల్లా కలెక్టర్ దృష్టికీ సమస్య తీవ్రతను తీసుకెళ్లి బుక రాములుకు సిపిఐ తెలంగాణ పార్టీ పక్షాన న్యాయం చేస్తాం అని సిపిఐ పార్టీ జాతీయ నాయకుడు మాజీ శాసన సభ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి బుక రాములుకు సిపిఐ తెలంగాణ పార్టీ పరంగా ఘనంగా హామీని ఇచ్చారు. ఇట్టి కార్యక్రమంలో వారితో పాటు, సిపిఐ పార్టీ కేంద్ర రాష్ట్ర కమిటీ సభ్యులు, సిపిఐ పార్టీ మహిళా విభాగం సభ్యులు, కవులు, కళాకారులు, మేధావులు, ఆయా జిల్లాల కమిటీ సభ్యులు, మండల కమిటీల సభ్యులు, ధర్మపురి మండల ప్రజలు, ధర్మపురి పట్టణ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.