జగిత్యాల రూరల్ మండలం సంగంపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ డా. బోగ శ్రావణి గురువారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నలువాల తిరుపతి, జిల్లా కోశాధికారి సుంకేట దశరథ్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు ఇట్నేని రమేష్, మాజీ సర్పంచ్ నల్లపు మీనయ్య, నేరెళ్ల శివకాంత్ పాల్గొన్నారు.