జగిత్యాల పట్టణంలోని కొత్త బస్టాండ్ ఔట్ గేటు ఎదురుగా బాబాసాయి బేకరీపై మున్సిపల్ అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. బేకరిలో బూజు పట్టిన కేకులు, బ్రెడ్డులు విక్రయిస్తున్నారనే ఫిర్యాదుతో అధికారులు బేకరీలో సోదాలు చేశారు. కుళ్ళిపోయిన కోడిగుడ్లు, దుర్వాసనతో ఉన్న కేకులు, బేకరీకి వాడే ఇతర ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకొని చెత్త ట్రాక్టర్ లో పడేశారు. బేకరీ యజమానికి నోటీసు ఇచ్చారు.