జగిత్యాల రూరల్ మండల్ తిమ్మాపూర్ గ్రామానికి చెందిన బిజెపి నాయకులు దుబ్బాక రమేష్ గుర్తు తెలియని దుండగుల దాడిలో గాయపడి పట్టణంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఉండగా, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, నియోజకవర్గం ఇన్ ఛార్జ్ బోగ శ్రావణి బుధవారం వారిని కలిసి పరామర్శించారు. ఇలాంటి దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. ఈ దాడికి పాల్పడిన వారిని వెంటనే పోలీసులు కఠినంగా శిక్షించాలన్నారు.