జగిత్యాల: వినియోగదారునిపై ఉడిపి హోటల్ నిర్వాహకుల దాడి

72చూసినవారు
జగిత్యాల పట్టణంలోని కొత్త బస్ స్టాండ్ సమీపంలో గల ఓ ఉడిపి హోటల్ నిర్వాహకులు శనివారం వినియోగదారునిపై దాడికి పాల్పడ్డారు. జగిత్యాల పట్టణానికి చెందిన పాపన్క కిషన్ టిఫిన్ చేయడం కోసం ఉడిపి హోటల్ కు వెళ్లి పూరీ కోసం టోకెన్ కొనుగోలు చేశాడు. అయితే నిర్వాహకులు ఎంతసేపు నిరీక్షించినా టిఫిన్ అందివ్వకపోవడంతో ఇదేమని ప్రశ్నించిన కిషన్ పై హోటల్ నిర్వాహకులు దాడికి పాల్పడ్డారని బాధితుడు తెలిపాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్