తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ యువజన ఎన్నికలలో అల్లీపూర్ గ్రామానికి చెందిన పోతు ప్రవళిక ఉపాధ్యక్షురాలిగా గురువారం గెలుపొందడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మరియు పలువురు కాంగ్రెస్ నాయకులు ప్రవళికను అభినందించారు. తనకు అన్ని రకాలుగా ఎన్నికల్లో సహకరించిన పార్టీ సభ్యులందరికీ ప్రవళిక హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.