జిల్లా కోర్టులో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

59చూసినవారు
జిల్లా కోర్టులో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
78 వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా కోర్టులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి ప్రతిమ జాతీయ జెండాను ఎగురవేశారు. మొదట జాతీయ నేతలైన జాతిపిత మహాత్మా గాంధీ, బిఆర్ అంబేద్కర్ ల చిత్రపటాలకు పూలమాల వేసి కొబ్బరికాయ కొట్టారు. అనంతరం భారతమాతకు జై అంటూ పలువురు న్యాయవాదులు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు పివి రాజకుమార్, అదనపు జిల్లా న్యాయమూర్తులు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్