నూతన కలెక్టరేట్ నిర్మాణ పనులన్నీ పూర్తి చేసి సెప్టెంబర్ 15 వరకు ప్రారంభానికి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆర్అండ్్బ అధికారులను ఆదేశించారు. పనులన్నీ ఎప్పటికప్పుడు వేగవంతం చేయాలని సూచించారు. పనులపై నిర్లక్ష్యం చేయవద్దని పేర్కొన్నారు. కరీంనగర్లోని నూతన కలెక్టరేట్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. నిర్మాణ పనులకు సంబంధించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు.