మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గురుకులంలో ఓ విద్యార్థికి పాము కాటు, మరో విద్యార్థి అస్వస్థతకు గురికావడంతో తల్లిదండ్రులు పాఠశాలకు గురువారం భారీ సంఖ్యలో చేరుకున్నారు. పిల్లలకు సరైన సౌకర్యాలు లేకపోవడంతో ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఓంకార్, అఖిల్ పాము కాటుకు గురైకోరుట్ల ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.