చెరుకు రైతుల ప్రయోజనార్ధం మూతపడ్డ నిజాం షుగర్ ఫ్యాక్టరీ లను తెరిపించాలని కోరుట్ల
కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు డాక్టర్ కుందారపు సాయికుమార్ అన్నారు. మంగళవారం మల్లాపూర్ మండల కేంద్రం లోని తహశీల్దార్ కార్యాలయంలో ఇంచార్జి తహశీల్దార్ శ్రావణికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం
కేసీఆర్ ఎన్నికల హామీని మరిచి చెరుకు రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని దుయ్యబట్టారు.