శంకరపట్నం మండలం కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో గోల్కొండ కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో గురువారం సీజనల్ వ్యాధులు పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వర్షాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అవగాహన కల్పించాలని డా. సురేష్ వైద్య సిబ్బందికి సూచించారు. ఈకార్యక్రమంలో ఎంపీఓ ఖాజా బషీరుద్దీన్, సి. హెచ్. ఓ భాస్కర్, డాక్టర్లు శ్వేత, చిత్ర, అనిల్, ఏ. ఈ మొగిలి పాల్గొన్నారు.