మానకొండూరు మండలం కొండపలకల జెడ్పి ఉన్నత పాఠశాల 1997-98 పదవ తరగతి పూర్వ విద్యార్థుల కలయిక ఆదివారం నిర్వహించారు. చదువు చెప్పిన గురువులను భుజాలపై మోసుకుని వెళ్లి ఘనంగా సన్మానించారు. చిన్ననాటి గురువుల బోధనలను, క్రమశిక్షణ నేర్పిన విధానాన్ని గుర్తు చేసుకున్నారు. గురువుల దయతోనే తాము ఉన్నత స్థితిలో ఉన్నామని కృతజ్ఞతలు తెలిపారు. పాతిక సంవత్సరాల అనంతరం ఒకే చోట కలిసిన మిత్రులు ఉద్వేగానికి లోనయ్యారు.