పెద్దపల్లి జిల్లా ఎడిటర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక బాలసాని వెంకటేష్, మల్లెబోయిన శ్రీనివాస్ ఆద్వర్యంలో సోమవారం పెద్దపల్లిలో నిర్వహించారు. జిల్లా అధ్యక్షులుగా చేగొండ రవికుమార్, ప్రధాన కార్యదర్శిగా కొల్లూరు శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా ఎన్ డి తివారి, కోశాధికారిగా బొల్లం వేణు, ప్రచార కార్యదర్శిగా శాంతిరాజ్, కార్యవర్గసభ్యులుగా మల్లెబోయిన శ్రీనివాస్, బాలసాని వెంకటేశంలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.