ఇందిరమ్మ ఇండ్ల సర్వే త్వరితగతిన పూర్తి చేయాలని మంథని డీఎల్ పీఓ సతీష్ కుమార్ ఆదేశించారు. గురువారం రామగిరి మండలంలోని కల్వచర్ల గ్రామాన్ని తనిఖీ చేసి పంచాయతీ రికార్డులను పరిశీలించారు. అలాగే పారిశుద్ధ్య పనులను పరిశీలించి పంచాయతీ కార్యదర్శి, సిబ్బందికి సూచనలు చేశారు. గడువు తేదీలోగా సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శి శ్రీధర్, సిబ్బంది పాల్గొన్నారు.