అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకున్న గ్రామస్తులు

2249చూసినవారు
అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకున్న గ్రామస్తులు
సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామంలో ఎనగుట్ట వద్ద అక్రమ మట్టి తవ్వకాలను బుధవారం గ్రామస్తులు అడ్డుకున్నారు. రోడ్డు బురదమయంగా మారి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ట్రిపర్ల డ్రైవర్లు అతివేగంగా నడిపి పంట పొలాల్లోకి దూసుకెళ్తున్నారని ఎంపీటీసీ ఇందిరా సుధీర్ ఆవేదన వ్యక్తం చేశారు. మట్టి తవ్వకాలను ఆపాలని, గుట్టలను తవ్వి సహజ సంపదను కొల్లగొడుతున్నా రెవెన్యూ భూగర్భ అధికారులు పట్టించుకోవడంలేదని తెలిపారు.

సంబంధిత పోస్ట్