జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు, ఇళ్ల మంజూరు కోసం కృషి చేస్తామని టీయూడబ్ల్యూజే- ఐజేయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు బుర్ర సంపత్ కుమార్ గౌడ్ అన్నారు. మంగళవారం పెద్దపల్లిలో యూనియన్ జిల్లా శాఖ మెంబర్ షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఎనలేని కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు నారాయణదాసు, అశోక్, జిల్లా కార్యదర్శి బాలసాని రాజయ్య పాల్గొన్నారు.