కార్పోరేట్ లుక్ వచ్చేలా సకల సౌకర్యాలతో టాస్క్ భవనం ఆధునీకరణకు ప్రతిపాదనలను రివైజ్ చేసి సమర్పించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులకు సూచించారు. మంగళవారం పెద్దపల్లి ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలోని టాస్క్ భవనాన్ని పరిశీలించి ఆధునీకరణ ప్రతిపాదనలపై అధికారులకు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట ఉమ్మడి జిల్లా టాస్క్ మేనేజర్ గంగాప్రసాద్, పిఆర్ డిఈ శంకరయ్య పాల్గొన్నారు.