గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కార్పోరేటర్

439చూసినవారు
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కార్పోరేటర్
గోదావరిఖనిలో 44వ డివిజన్ రాజీవ్ నగర్ లో గురువారం కాంగ్రెస్ పార్టీ ఎస్సి సెల్ పట్టణ అధ్యక్షులు పంజా శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా రామగుండం మున్సిపల్ కార్పోరేషన్ 44వ డివిజన్ కార్పోరేటర్ ఎండీ ముస్తఫా పాల్గోని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.... నేడు స్వతంత్ర భారతదేశాన్ని గణతంత్ర రాజ్యంగా మార్చిన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు అని అన్నారు.

‘‘ఇప్పటికి 73 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన రాజ్యాంగ కర్తలను స్మరించుకుందాం అని అన్నారు. వారి బాటలో నడిచి దేశ అభ్యున్నతికి కృషి చేద్దామని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గోన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్