రామగుండం కార్పోరేషన్ పరిధి 44వ డివిజన్ రమేశ్ నగర్ లో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా 44వ డివిజన్ కార్పోరేటర్ ఎండీ ముస్తాఫా మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలను నాటాలని అన్నారు. భవిష్యత్తు కోసం, పుడమిని కాపాడేందుకు అందరు సమిష్టిగా మొక్కలను నాటాలని, పిల్లలు, భవిష్యత్తు తరాల కోసం మొక్కలు నాటి సంరక్షించాలన్న ఆలోచన అందరికీ రావాలి అన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటిని సంరక్షించుకోవాలి అని కోరారు.