పాలకుర్తి మండలం ఎల్కలపల్లి మండల పరిషత్ పాఠశాలలో సోమవారం బండారి రాజయ్య ద్వితీయ వర్ధంతి పురస్కరించుకొని బండారి ప్రసాద్ సుజాతలు పాఠశాల విద్యార్థులకు నోటు బుక్స్, జామెంట్రీ బాక్స్, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం లక్ష్మీనారాయణ, పంచాయతీ సెక్రెటరీ రమ్య, కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గోన్నారు.