మక్ష్ గ్లోబల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఉత్తమ జ్యోతిష్య శాస్త్ర పండితులకు గ్లోబల్ అవార్డ్స్-2024 అందజేశారు. గోదావరిఖనికి చెందిన సింగరేణి ఒసిపి5 ఉద్యోగి ధూళిపాల మల్లికార్జున శర్మ కి ముఖ్య అతిథి మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి చేతుల మీదుగా గ్లోబల్ నంది అవార్డులను అందజేశారు. నిర్వాహకులు, తదితరులు పాల్గోన్నారు. శర్మ కి అవార్డు రావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.