వైకుంఠ ఏకాదశి సందర్భంగా పెద్దపల్లి పట్టణంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న ఎంపీ ప్రజల శ్రేయస్సు, పాడి పంటల సమృద్ధి, సుఖ సంతోషాల కోసం ప్రార్థించారు. ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు ఎంపీని శాలువాతో సత్కరించి, తీర్థ ప్రసాదాలను అందజేశారు.