వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టెముల గ్రామంలో మీకోసం కార్యక్రమానికి బుధవారం ముఖ్య అతిదిగా వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి హాజరయ్యారు. ప్రజలకు రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ నియమాలు, గల్ఫ్ ఏజెంట్ ల మోసాలు, సైబర్ మోసాలు, మహిళా చట్టాలు, షీ టీమ్, నూతన చట్టాలపై అవగాహన, సీసీ కెమెరాల యొక్క ఆవశ్యకత గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఏఎస్పీ మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రృత్తంగా ఉండాలన్నారు.