భారతదేశం ఆర్థిక సంక్షోభం ఉన్న పరిస్థితుల్లో ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టి దేశ ఆర్థిక వృద్ధిరేటును పరుగులు పెట్టించిన మహోన్నత వ్యక్తి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆని వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపం తెలుపుతూ శుక్రవారం వేములవాడ పట్టణం మహంకాళి గుడి (బ్రిడ్జి) దగ్గర మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.