వృధాగా పోతున్న మిషన్ భగీరథ నీరు

590చూసినవారు
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం రూట్ లోని వేములవాడ-సిరిసిల్ల బైపాస్ రోడ్డు ప్రధాన రహదారి ప్రక్కన మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలిపోయి భారీగా నీరు వృధాగా పోతుంది. పైప్ లైన్ నుంచి పెద్ద మొత్తంలో నీరు లీకేజీ కావడంతో ఆ ప్రాంతం అంతా జలమయమై చెరువును తలపిస్తుంది. వెంటనే మిషన్ భగీరథ అధికారులు స్పందించి లీకేజీని మరమ్మత్తులు చేసి నీరు వృధా కాకుండా చేయాలని స్థానిక ప్రజలు, ప్రయాణికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్