రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామంలోని మిడ్ మానేరు జలాశయంలో ముదిరాజ్ మత్స్యకార సంఘం ఆధ్వర్యంలో తేప్పల పోటీలు శుక్రవారం నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరై, పోటీలో విజేతలుగా నిలిచిన వారికి ఎస్పీ అఖిల్ మహజన్ తో కలసి బహుమతులను ప్రధానం చేశారు. ఈ పోటీలలో విజేతలుగా మొదటి బహుమతి తునికి రఘు, రెండవ బహుమతి కూన కుమార్, మూడవ బహుమతి పండుగ వంశీలు నిలిచారు.