వైకుంఠ ఏకాదశి సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయంలో శుక్రవారం ఉదయం ప్రత్యేక పూజలు అర్చక స్వాములు నిర్వహించారు. స్వామి వారి పూజ కార్యక్రమాలు అనంతరం అంతరాలయంలో హరిహరులు పెద్ద సేవపై విహరిస్తూ.. భక్తులకు దర్శనమిచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో సందడిగా మారాయి.