కోరుట్ల
కోరుట్ల: అదుపుతప్పిన టిప్పర్
జగిత్యాల మెట్ పల్లి పట్టణం బస్టాండ్ సమీపంలో బుధవారం అర్ధరాత్రి అతి వేగంతో వెళ్తున్న మొరం టిప్పర్ ముందు ఉన్న మరో టిప్పర్ ను ఢీకొని వ్యాపార సముదాయాల్లోకి దూసుకెళ్లిందని స్థానికులు తెలిపారు. రాత్రి జనసంచారం లేకపోవడంతో ప్రాణాపాయం తప్పిందని చెప్పారు. విచ్చలవిడిగా రాత్రి, పగలు నడుస్తున్న మొరం అక్రమ తరలింపులపై అధికారులు చోద్యం చూస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు.