పిజ్జాలో పురుగు.. కంగుతిన్న కస్టమర్
జొమాటోలో పిజ్జా ఆర్డర్ చేసి దానిని తింటున్న ఓ కస్టమర్‌కి ఊహించని అనుభవం ఎదురైంది. పిజ్జాను తింటుండగా అందులో పురుగు కనిపించింది. దీంతో కంగుతిన్న కస్టమర్ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. కోశాల్ గుప్తా అనే వ్యక్తికి ఈ చేదు అనుభవం ఎదురైంది. దీనిపై జొమాటో స్పందించింది. జరిగిన తప్పుకు క్షమాపణలు చెప్పింది. పిజ్జా పంపిన రెస్టారెంట్‌తో సంప్రదింపులు జరిపి తగిన న్యాయం చేస్తామని తెలిపింది.