రాష్ట్రంలోని గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని బుధవారం వీణవంకకు చెందిన బిఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్యకర్తలు నిరసన తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ హైదరాబాదులోని సంక్షేమ భవనాన్ని ముట్టడించారు. సీఎం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఘటన స్థలంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.